‘గేమ్ ఛేంజర్’ : ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్

‘గేమ్ ఛేంజర్’ : ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్

Published on Oct 23, 2023 9:52 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో సునీల్, అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

విషయం ఏమిటంటే, నేడు దసరా పండుగని పురస్కరించుకుని ప్రేక్షకాభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్, మూవీ నుండి ‘జరగండి జరగండి’ అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని రానున్న దీపావళి నాడు రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ఇక ఇటీవల ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. కాగా ఫుల్ సాంగ్ ని మంచి హై క్వాలిటీ తో మేకర్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు