గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ కి తల్లిగా గంగవ్వ!

Published on Oct 4, 2021 12:02 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అదే మెగాస్టార్ కి తల్లిగా నటించే పాత్ర గురించి.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఊటి లో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :