ట్రైలర్: గ్యాంగ్ లీడర్-నాని కామెడీ టైమింగ్ అదిరింది

Published on Aug 28, 2019 11:36 am IST

చెప్పినట్లే నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ తో దిగాడు. కొందరిపై పగకోసం ఎదురు చూస్తున్న ఐదుగురు ఆడవారిని ముందుకు నడిపే రివేంజ్ రైటర్ గా ఇరగదీశాడు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ని దర్శకుడు కామెడీ,రొమాన్స్,యాక్షన్ అంశాలు కలగలిపి ఆసక్తికరంగా మలిచాడు.

హాలీవుడ్ సినిమాలు చూసి అందులోని కథలను కాపీ కొట్టి పుస్తకాలు రాసే వాడు మిస్టర్ పిన్సిల్. కొందరిపై ప్రతీకారం కొరకు ఎదురు చూస్తున్న ఐదుగురు ఆడవాళ్లు మిస్టర్ పెన్సిల్ రాసిన కథలు చదివి తనైతే వారికి సహాయం చేయగలడని ఆతన్ని కలవడం జరుగుతుంది. ఇప్పటివరకు కాపీ రివేంజ్ స్టోరీలు రాసిన మిస్టర్ పెన్సిల్ కి వీరివలన ఓ రియల్ రివేంజ్ స్టోరీ దొరుకుతుంది. ఒక బలమైన శత్రువుని ఎదుర్కొనే లక్ష్యంలో వారికి మిస్టర్ పెన్సిల్ మార్గదర్శకంగా మారతాడు.

కామెడీతో సాగే రివేంజ్ డ్రామాగా గ్యాంగ్ లీడర్ అనిపిస్తుంది. మొదటిసారి విలన్ గా చేసిన హీరో కార్తికేయ మిలియనీర్ లుక్ లో రిచ్ గా ఉన్నాడు. ఇక సీనియర్ నటి లక్ష్మి, శరణ్యల కామెడీ టైమింగ్ బాగుంది. అన్ని అంశాలతో కూడిన గ్యాంగ్ లీడర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :