విడుదల తేదీని ఖరారు చేసుకున్న ‘బాలకృష్ణ’ 100వ చిత్రం
Published on Jul 26, 2016 6:04 pm IST

Gautamiputra-Satakarni
‘నందమూరి బాలకృష్ణ’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న తన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. విలక్షణ దర్శకుడు ‘క్రిష్’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొన్నటి వరకూ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే దర్శకుడు క్రిష్ కు పెళ్లి నిశ్చయమవడంతో షూటింగ్ కు కాస్త విరామమిచ్చారు. అన్ని విభాగాల్లోనూ పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకుని మరీ టీమ్ సినిమా పనులు చేస్తుండగా దర్శకుడు క్రిష్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశాడు.

ముందునుంచి అనుకుంటున్నట్టు 2017 సంక్రాంతి కానుకగానే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు. 99వ చిత్రం అనంతరం బాలయ్య ఎన్నో డిస్కషన్ల తరువాత ఏంతో మక్కువతో ఈ ప్రాజెక్టును ఒకే చేశారు. చరిత్రను, శాతకర్ణి వీరత్వాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రం తీస్తున్నానని క్రిష్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ‘శ్రియ శరన్’ నటిస్తుండగా ‘దేవి శ్రీ’ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook