అజిత్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న గౌతమ్ మీనన్ !

తమిళ స్టార్ హీరో అజిత్, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్లు మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్త కోలీవుడ్లో తెగ సందడి చేస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఎన్నై అరిందాల్’ అనే సినిమా చేశారు. 2015లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ‘ఎంతవాడు గాని’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది.

గౌతమ్ మీనన్ మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తలు ఫలించి వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి కుదురుతుందేమో చూడాలి. ఇకపోతే అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేయనున్న ‘విశ్వాసం’కు సిద్ధమవుతుండగా గౌతమ్ మీనన్ ధనుష్ తో ఒక సినిమా, విక్రమ్ తో ‘ధృవ నచ్చత్తిరమ్’ అనే మరో సినిమా చేస్తున్నారు.