సూర్యకు కథ వినిపించనున్న క్రేజీ డైరెక్టర్

Published on Feb 27, 2020 2:11 am IST

ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ అనే సినిమా చేస్తున్న సూర్య ఇంకొన్ని కొత్త చిత్రాలకు కమిటవుతున్నారు. వాటిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ చిత్రం కూడా ఉండనుంది. ఇదివరకే గౌతమ్ మీనన్, సూర్యల కాంబో గురించి వార్తలు వచ్చినా ఎక్కడా కన్ఫర్మేషన్ అందలేదు. దీంతో ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు అందరూ. కానీ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఇంకో పది రోజుల్లో గౌతమ్ మీనన్ సూర్యకు కథ వినిపించనున్నారట. గౌతమ్ మీనన్ డైరెక్షన్ అంటే ఏంతో ఇష్టపడే సూర్య తప్పకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తమిళ సినీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. గౌతమ్ మీనన్ గతంలో సూర్యతో కలిసి ‘కాఖ కాఖ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలు చేశారు. అందుకే వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More