గీత గోవిందం రెండో సారి కూడా .. !

Published on Dec 6, 2018 2:01 pm IST

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విజయ్ కి స్టార్ హీరో రేంజ్ ను తీసుకువచ్చింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం అటు బుల్లితెర మీద కూడా రికార్డ్స్ సృష్టించింది. ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు దక్కించుకుంది. ఇక ఈ చిత్రాన్ని మొదటి సారి ప్రసారం చేసినప్పుడు రికార్డు స్థాయిలో 20.18 టీఆర్పీని రాబట్టగా ఇటీవల రెండో సారి టెలీకాస్ట్ చేసినప్పుడు 17.16 టీఆర్పీ ని రాబట్టి బుల్లితెర మీద కూడా బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

పరుశురాం తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనెర్ లో విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More