గెట్ రెడీ..”RRR” నుంచి బ్లాస్టింగ్ గిఫ్ట్ సిద్ధంగా ఉంది.!

Published on Mar 20, 2021 8:03 am IST

ఇండియన్ సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతి కొద్ది చిత్రాల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి.

మరి ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటి నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడ్ ప్రతీ ఒక్కరి పుట్టినరోజుకు కూడా ఏదొక అప్డేట్ ఇస్తున్నారు. మరి ఇదిలా ఉండగా గత ఏడాది చరణ్ బర్త్ డే లాక్ డౌన్ లో టీజర్ తో ఒక ఫైరింగ్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్ ఈ ఏడాది కూడా ఒక బ్లాస్టింగ్ గిఫ్ట్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అంతే కాకుండా దానిపై కూడా ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వనున్నారు. సో ఇప్పుడు చెయ్యాల్సింది అంతా ఆ అప్డేట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈసారి రాజమౌళి పోస్టర్ తో సరిపెడతారా లేక మళ్ళీ ఏదన్నా టీజర్ ను విడుదల చేస్తారా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :