గెట్ రెడీ..”ఆచార్య” రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేస్తుందా?

Published on Oct 6, 2021 6:05 pm IST


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య”. లాక్ డౌన్ కు ముందే ఎప్పుడో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు ముగింపు దశకు వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్నాళ్లుగా ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో నడుస్తుంది. ఆల్ మోస్ట్ అయితే ఈ సినిమా కూడా డిసెంబర్ 17 కె ఫిక్స్ అవుతుంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుండగా..

ఇప్పుడు దీనిపై అనౌన్స్మెంట్ కి సమయం కూడా ఎంతో లేదని వినిపిస్తుంది. అది రేపే కావచ్చు లేదా ఈ వారం ముగిసే లోపే ఉండొచ్చని సరికొత్త టాక్. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :