గెట్ రెడీ..”సీటీమార్” సందడి థియేటర్స్ లోనే.!

Published on Aug 20, 2021 8:40 pm IST

మన టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. తన మోస్ట్ అండర్ రేటెడ్ దర్శకుడు సంపత్ నంది నంది కాంబోలో తెరకెక్కించిన రెండో సినిమా ఇది. దీనితో మంచి అంచనాలు ఆడియెన్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా అయితే మంచి హిట్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో పూర్తయ్యింది. థియేటర్స్ లో కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యి లాస్ట్ మినిట్ లో ఆగింది.

తర్వాత మళ్ళీ ఓటిటి అంటూ టాక్ నడిచేసరికి మళ్ళీ థియేటర్స్ తలుపులు తెరుచుకోవడంతో సిల్వర్ స్క్రీన్ పైనే ఈ సినిమా అని ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడు మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సీటీమార్ హవా కేవలం థియేటర్స్ లోనే ఉంటుంది అని అలాగే వచ్చే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ చేసారు.

అలాగే మెయిన్ డేట్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :