రేపు విడుదల కానున్న “గని” టీజర్

Published on Nov 14, 2021 9:01 pm IST


వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం కి సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ ఈ చిత్రం లో బాక్సర్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, అంతెం సాంగ్ విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన క్యారెక్టర్స్ ను వరల్డ్ ఆఫ్ గని పేరిట చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను రేపు ఉదయం 11:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :