“గుడ్ లక్ సఖి” రిలీజ్ డేట్ ఫిక్స్!

“గుడ్ లక్ సఖి” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Nov 15, 2021 7:03 PM IST


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పడిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని థియేటర్ల లోనే విడుదల చేస్తున్నట్లు తాజా ప్రకటన లో తెలిపింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు