ఓటిటి లో దూసుకు పోతున్న “CSI సనాతన్‌”

Published on May 24, 2023 4:30 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా, మిషా నారంగ్ హీరోయిన్ గా చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై శివ శంకర్ దేవ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం CSI సనాతన్‌. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. అయితే డిజిటల్ ప్రీమియర్ గా మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఆహా వీడియో లో మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో లో కలిపి ఈ చిత్రం 60 మిలియన్స్ మినిట్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనీష్ సోలమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధు సూదన రావు, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :