షూటింగ్ పూర్తి చేసుకున్న’గూఢచారి’ !
Published on Jun 15, 2018 2:30 pm IST

అడివి శేష్ ప్రధాన పాత్రలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం’ గూడచారి’. ఈ సినిమాకు సంబందించిన చిత్రీకరణ పూర్తైంది. ఇండియా, బంగ్లాదేశ్, యుఎస్ఎ మొదలుగు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్క డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో శోభిత దూళిపాళ్ల తెలుగు తెరకు కథానాయికగా పరిచయంకానుంది.

సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘క్షణం’ సినిమా తరువాత అడివి శేష్ నటిస్తున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook