‘గోపాల గోపాల’కు సంక్రాంతి అడ్వాంటేజ్..

‘గోపాల గోపాల’కు సంక్రాంతి అడ్వాంటేజ్..

Published on Jan 9, 2015 7:06 PM IST

gopala-gopala
సంక్రాంతి పండుగ సమయంలో ‘గోపాల గోపాల’ సినిమా విడుదల కానుండడం పెద్ద అడ్వాంటేజ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆధ్యాత్మిక కధాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. పండుగ వాతావరణంలో సరైన సమయంలో సరైన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల వద్దకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు, సినిమాపై ఆధ్యాత్మిక ముద్రకు తోడు పవన్ కళ్యాణ్ మేనియా జత కావడంతో సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. శుక్రవారం కలెక్షన్స్ కోల్పోయినా, నిర్మాతలు పెద్ద భయపడాల్సిన అవసరం లేదని.. తొలి వారంలో సినిమాకు బంపర్ కలెక్షన్స్ దక్కడం ఖాయమని ట్రేడ్ పండితుల అంచనా.

భారి అంచనాలతో విడులవుతున్న శంకర్ ‘ఐ’ సినిమా ప్రభావం ‘గోపాల గోపాల’పై పడే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ టాక్. గత సంక్రాంతికి రెండు భారి సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఈ సంక్రాంతికి సైతం అదే రిపీట్ అవుతుందని సినీ ప్రముఖులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు