ఫైర్ ఆఫీసర్ గా గోపీచంద్

ఫైర్ ఆఫీసర్ గా గోపీచంద్

Published on Mar 25, 2015 8:26 AM IST

Jil
‘సాహసం’, ‘లౌక్యం’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కోసం మనం ముందుకు తీసుకురానున్న సినిమా ‘జిల్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో గోపీచంద్ డేరింగ్ అండ్ డాషింగ్ ఫైర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడని సమాచారం. ఒక ఫైర్ ఆఫీసర్ అన్యాయం మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది డైరెక్టర్ ఈ సినిమాలో చూపించాడు. ఈ పాయింట్ ఆన్ స్క్రీన్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అని ఈ చిత్ర మేకర్స్ అంటున్నారు.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన బ్యూటిఫుల్ రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. జిల్ లో అటు గోపీచంద్ మునుపెన్నడూ కనపడని స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనపడుతుంటే, అటు రాశిఖన్నా కూడా చాలా స్టైలిష్ అండ్ అల్ట్రా గ్లామరస్ గా కనిపించనుంది. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

మరి గోపీచంద్ ఫైర్ ఆఫీసర్ గా ఆడియన్స్ మెప్పిస్తాడా.? అలాగే హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా.? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు