సౌత్ హీరోల్లో ఎవరూ చేయని సాహసం చేసిన గోపీచంద్ !


హీరో గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘గౌతమ్ నంద’ కూడా ఒకటి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దుబాయ్ లో ఓ పాటను భారీ స్థాయిలోతెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ పాట దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ వంటి ఫేమస్ లొకేషన్లలో జరుగుతోంది. ఈ పాట కోసం గోపీచంద్ పూర్తి స్థాయి స్కై డైవింగ్ చేశారట.

ఒకరకంగా ఇది సాహసమేనని, ఇప్పటికే వరకు సౌత్ సినిమాలో ఏ హీరో కూడా ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కై డైవింగ్ ఎపిసోడ్ చేయలేదని, గోపి చంద్ గారి ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. అలాగే దుబాయ్ లో చిత్రీకరిస్తున్న ఈ ఎపిసోడ్లు అభిమానులకు ఆశ్చర్యాన్ని, మంచి వినోదాన్ని ఇచ్చే విధంగా ఉంటాయని అన్నారు. హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.