రాశిఖన్నాను ప్రశంసలతో ముంచెత్తిన గోపీచంద్!

రాశిఖన్నాను ప్రశంసలతో ముంచెత్తిన గోపీచంద్!

Published on Mar 23, 2015 12:32 PM IST

gopichandh
గోపీచంద్ హీరోగా రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ సినిమాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం.. ‘జిల్’. రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. గోపీచంద్ గత సినిమా లౌక్యం సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఈ మధ్యనే విడుదలైన జిల్ ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్, గిబ్బన్ మ్యూజిక్‌లోని కొత్తదనానికి పూర్తి మార్కులు వేశారు.

తాజాగా సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ.. గోపీచంద్, దర్శకుడు రాధాకృష్ణ, హీరోయిన్ రాశిఖన్నాలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాశిఖన్నా తన గత చిత్రాల్లో కంటే ఈ సినిమాలో అందంగా, కొత్తగా కనిపిస్తుందని గోపీచంద్ అన్నారు. ఆమె, సినిమా కోసం చాలా కష్టపడుతుందని, భవిష్యత్‌లో మంచి స్టార్‌గా ఎదిగే టాలెంట్ ఆమెకుందని గోపీచంద్ అన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ ప్రతిభను గోపీచంద్ ప్రశంసించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు