అక్టోబర్ 1న విడుదల కానున్న ‘గోవిందుడు అందరివాడేలే’?

Published on May 29, 2014 9:39 am IST

Ram-Charan
రామ్ చరణ్ హీరో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ శేర వేగంగా సాగుతుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ 5న నుండి జరుగబోతుంది. అయితే ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ నెలలో మరియు సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం, చిత్ర యూనిట్ 2 పాటల చిత్రీకరణ కోసం లండన్ వెళ్లనున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

కృష్ణ వంశీ దర్శకత్వంలో మొదటి సారి నటిస్తున్న రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మరియు విడుదల తేదిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :