త్రివిక్రమ్ బన్నీ సినిమాలో గ్రేట్ యాక్టర్ ?

Published on Mar 24, 2019 11:39 pm IST

నానా పటేకర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఎమోషన్ని అయినా, ఎలాంటి డైలాగ్ నైనా కేవలం తన నటనతో తన మాడ్యులేషన్ తో వాటిని ఇంకా అద్భుతంగా మలచగలరు. రీసెంట్ గా ‘కాలా’ సినిమాలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కాగా ఇప్పుడు నానా పటేకర్ తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతున్న సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందట, ఆ పాత్రలో నానా పటేకర్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో బన్ని- త్రివిక్రమ్ కలిసి చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా తండ్రి కొడుకుల మధ్య కథే. అయితే ఆ కథలో చనిపోయిన ఫాదర్ ఎమోషన్ని పట్టుకొని కొడుకు జర్నీ ఉంటుంది. ఇక ఇప్పుడు చెయ్యబోయే సినిమాలో తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :