విడుదలైన సందీప్ కిషన్ “గల్లీ రౌడీ” ట్రైలర్

Published on Sep 12, 2021 6:34 pm IST

సందీప్ కిషన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం ను సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో ఈ ట్రైలర్ విడుదల అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది. కోన వెంకట్ మరియు ఎంవివి సత్య నారాయణ ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమాస్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ మరియు చౌరస్తా రామ్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :