‘గల్లీ రౌడీ’ నుంచి మరో కొత్త సాంగ్ ప్రోమో..!

Published on Jul 20, 2021 12:18 am IST

యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా ‘గల్లీ రౌడీ’. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజర్స్‌కి, అలాగే ఇటీవ‌ల రిలీజైన ‘పుట్టెనే ప్రేమ’ అనే పాట‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘చాంగురే ఐటెమ్‌ సాంగ్‌రే’ అనే పాటకి సంబంధించి చిత్రబృందం ప్రోమో వీడియోను విడుదల చేసింది. హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఈ పూర్తి లిరికల్‌ వీడియోను గురువారం సాయంత్రం 4 గంట‌లకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, మంగ్లీ, సాయి కార్తీక్‌, దత్తు ఆలపించారు. కాగా ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్‌ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా, కోలివుడ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :