ఓటిటిలో “గుంటూరు కారం” హిందీ వెర్షన్ హవా

ఓటిటిలో “గుంటూరు కారం” హిందీ వెర్షన్ హవా

Published on Mar 13, 2024 8:01 AM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి లు కలయికలో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “గుంటూరు కారం”. మరి రీజనల్ గా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఒక సూపర్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాగా రీసెంట్ గా ఓటిటిలో కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్రం ఇందులో వచ్చాక ఎందుకో అందరికీ మరింత కనెక్ట్ అయ్యింది. ఇక హిందీ వెర్షన్ అయితే ఇంకా అని చెప్పాలి.

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చి 5 వారాలు అయ్యింది. అయితే ఈ ఐదు వారాల్లో కూడా గుంటూరు కారం హిందీ వెర్షన్ టాప్ 10 లో ట్రెండ్ అవుతూ కంటిన్యూ అవుతుండడం విశేషం. దీనితో హిందీ వెర్షన్ అటు సైడ్ గట్టి రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి. ఇప్పటికి కూడా టాప్ 10 ప్లేస్ లో ఈ చిత్రం ట్రెండ్ అవుతూ హవా కనబరుస్తుంది. మరి చూడాలి ఇంకా ఎన్ని రోజులు ట్రెండింగ్ లో ఉంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు