‘గుంటూరు కారం’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

‘గుంటూరు కారం’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

Published on Mar 30, 2024 3:01 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీగా నిర్మించారు.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించారు. విషయం ఏమిటంటే, ఇటీవల థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో విజయం సొంతం చేసుకుని అనంతరం ఓటిటి లో కూడా అదరగొట్టిన గుంటూరు కారం మూవీ ఏప్రిల్ 7న సాయంత్రం 6 గం. లకు ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ జెమినీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. మరి గుంటూరు కారం మూవీకి టెలివిజన్ ఆడియన్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు