తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన విలక్షణ నటుడు కలక్షన్ కింగ్ పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజు. ఈయన 1952, మార్చి19న జన్మించాడు. మొదట ఈయన పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు తన భాల్యాన్ని తిరుపతిలో గడిపారు. మోహన్ బాబు స్కూలింగ్ తిరుపతికి దగ్గరలోని మోదుగుల పాలెం గ్రామంలో జరిగింది. తరువాత పై చదువుల కోసం మోహన్ బాబు చెన్నై వెళ్ళాడు. ఈయన కొద్ది రోజులు ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసారు. కానీ ఆయన మనసంతా సినిమాల పైనే వుండేది. సినీ ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఎదురుకున్న ఆయన 1975 లో వచ్చిన ‘స్వర్గం నరకం’ సినిమా తొలి విజయాన్ని అందుకున్నారు.
డా.దాసరి నారాయణ రావు ఈయన పేరును భక్తవత్సలం నాయుడు నుండి మోహన్ బాబుగా మార్చాడు. అప్పటి నుండి మోహన్ బాబు అనే పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారు మ్రోగుతోనే ఉంది. డైలాగ్స్ చెప్పడంలో సీనియర్ ఎన్.టి.ఆర్ తరువాత మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి మోహన్ బాబు. ఈయనకు తెలుగు భాష పైన, సినిమా నిర్మాణం పైన మంచి కమాండ్ ఉంది. ఈయన ‘పెదరాయుడు’, అల్లుడుగారు’, ‘అసంబ్లీ రౌడి’,’మేజర్ చంద్రకాంత్’, ‘దేవత’ మొదలైన సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మోహన్ బాబు కేవలం ఉదిగానే కాదు నిర్మాతగా కూడా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై 50 కి పైగా సినిమాలను నిర్మించాడు. అంతే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి ఉచిత విద్యని అందిస్తున్నారు.
123తెలుగు.కామ్ తరపున పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.


