సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “హ్యాపీ బర్త్ డే”

Published on Jul 1, 2022 10:00 pm IST

లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ప్రధాన పాత్రల్లో రితేష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం హ్యాపీ బర్త్ డే. నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు సమర్పకులు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కి సిద్దం అవుతోన్న సమయం లో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను అందించడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ కి ఇప్పటి వరకు 3.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జూలై 8, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :