‘వీరమల్లు’ వల్ల మిగతా సినిమాలకి ఇక్కట్లు?

‘వీరమల్లు’ వల్ల మిగతా సినిమాలకి ఇక్కట్లు?

Published on Jun 4, 2025 11:00 AM IST

HHVM5

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ ఇక ఈసారి కన్ఫర్మ్ అయ్యిపోయింది అనుకుంటే మళ్ళీ ఏదొక అవాంతరం వస్తుంది.

అయితే ఇది వరకు ఇచ్చిన పలు డేట్స్ లో అప్పటికే ఉన్న ఇతర సినిమాలకి వీరమల్లు ఎఫెక్ట్ తగిలింది. ఇక మళ్ళీ జూన్ 12 నుంచి వాయిదా పడుతుండడం అనే మాట గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త డేట్స్ ఆ డేట్స్ లో ఇది వరకే ఉన్న సినిమాలకి వీరమల్లు వల్ల ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు.

ఇప్పటికే పలు సినిమాలు వాయిదాలు పడ్డాయి కానీ ప్రతీ సారి ఇదే తంతు కనిపిస్తుంది. దీనితో ఈసారి మాత్రం వీరమల్లు సినిమా వచ్చినా కూడా ఇతర సినిమాలు వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదు అన్నట్టు టాక్. దీనితో ఇక పవన్ సినిమానే కొత్త పోటీ లేని డేట్ ని వెతుక్కోవాల్సి ఉందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు