వరుణ్ తేజ్ ‘కంచె’ కోసం రామానాయుడులో భారీ సెట్

వరుణ్ తేజ్ ‘కంచె’ కోసం రామానాయుడులో భారీ సెట్

Published on Mar 19, 2015 12:29 PM IST

Kanchi1
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రసతుతం తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 27న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న నానాక్రం గూడా రామానాయుడు స్టూడియోస్ లో ఓ భారీ సెట్ ని వేసారు. ఈ సినిమా సెట్ 1940 రోజులుని తలపించే రాజమహల్ లా ఉంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి సినిమాలు అందించిన క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా 1940 – 50 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుంది. ఇదొక ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ ఓ మిలిటరీ ఆఫీసర్ గా కూడా కనిపిస్తాడని సమాచారం. వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఈ చిత్ర టీం ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు