‘హలో గురు’ ఆడియో అప్డేట్ !

Published on Oct 7, 2018 4:16 pm IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం యొక్క ఆడియో ను రేపు డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే వారంలో గ్రాండ్ గా జరుపనున్నారు. ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :