చంద్రబాబు సతీమణిగా నటించనున్న యంగ్ హీరోయిన్

Published on Aug 14, 2018 1:41 pm IST

ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టకముందు నుంచే ఈ చిత్రానికి సంబంధించి ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం నటులను ఫైనల్ చేస్తుండటంతో ఈ చిత్రం పై ఇంకా అంచనాలు పెడుతున్నాయి. ఈ చిత్రంలో రానా ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడుగారి సతీమణి నారా భువనేశ్వరీగారి పాత్ర కొరకు ఓ యంగ్ హీరోయిన్ని సెలెక్ట్ చేసింది చిత్రబృందం.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహాసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగ చైతన్య సరసన నటించిన తమిళ హీరోయిన్ మంజిమా మోహన్, నారా భువనేశ్వరిగారి పాత్రను పోషించనున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో మంజిమా త్వరలో పాల్గొంటారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More