సమీక్ష : “హెర్” – రొటీన్ క్రైమ్ థ్రిల్లర్

Published on Jul 22, 2023 2:15 am IST
HER Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రుహాని శర్మ, వికాస్ వశిష్ట, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రుద్ర, వినోద్ వర్మ, జీవన్, రవి వర్మ

దర్శకుడు : శ్రీధర్ స్వరాఘవ్

నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి

సంగీతం: పవన్

సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి

ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుహాణి శర్మ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “హెర్”. మరి ఈ చిత్రం కూడా ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ ప్రాంతాల్లో విశాల్, స్వాతి అనే ఇద్దరి తాలూకా మృతదేహాలను అయితే పోలీసులు గుర్తిస్తారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న వారి మరణ కేసులుని అయితే అప్పటికే సస్పెన్షన్ నుంచి తిరిగి వచ్చిన అర్చన ప్రసాద్(రుహాణి శర్మ) కి పోలీస్ ఆఫీసర్ కి అయితే ఈ మిస్టరీని ఛేదించాలని అప్పగిస్తారు. అయితే తర్వాత వారి మరణానానికి ఈ అర్చన గన్ కి సంబంధం ఉంది అనే ఓ షాకింగ్ నిజం తర్వాత తెలుస్తుంది. మరి ఇంతకీ వారిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఇందులో అర్చనని ఎవరైనా ఇరికించారా? చివరికి ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇప్పటివరకు కొన్ని సెటిల్డ్ రోల్స్ డీసెంట్ పాత్రల్లోనే చూసిన రుహాణి శర్మని ఈ చిత్రంలో అయితే కాస్త కొత్తగా చూడవచ్చు. ఓ సీరియస్ కాప్ రోల్ లో అయితే రుహాణి పర్ఫెక్ట్ గా సెట్ కాగా అందులో అద్భుతమైన పెర్ఫామెన్స్ ని కూడా కనబరిచింది. దీనితో ఆమె ఓ పక్కింటి అమ్మాయి లాంటి సింపుల్ రోల్స్ మాత్రమే కాకుండా ఇలాంటి సీరియస్ పాత్రలు కూడా చేయగలడు అని ప్రూవ్ చేసుకుంది.

ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ మరో హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడ రేకెత్తించే ఇంటెన్స్ వాతావరణం సెకండాఫ్ పై ఆసక్తిని తీసుకొస్తుంది. అలాగే నటుడు జీవన్ సహా మరి నటుడు చిత్రం శ్రీను పై ఓ కామెడీ ట్రాక్ బాగుంటుంది. ఇంకా సంజయ్ స్వరూప్, ప్రదీప్ రుద్రా, రవి వర్మ తదితర నటులు తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ టేస్ట్ మారింది కదా అని థ్రిల్లర్ జానర్ లో చాలా కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే ఇది మాత్రం ఈ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రొటీన్ ఓల్డ్ ఫార్మాట్ లో ఉందని చెప్పాలి. సినిమా మెయిన్ లైన్ లో ఎలాంటి కొత్తదనం లేదు. మెయిన్ గా సెకండాఫ్ పెద్ద డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.

అలాగే సినిమాలో ఉన్న చాలా ఎలిమెంట్స్ బోర్ తెప్పిస్తాయి. అదే రొటీన్ లవ్ ట్రాక్, ఆసక్తిగా అనిపించని కొన్ని ట్విస్ట్ లు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఇంకా వీటితో పాటుగా సరైన ఎమోషన్స్ కూడా ఇందులో లేవు. పైగా ఈ ఈ చిత్రానికి సీక్వెల్ కూడా అన్నారు కానీ అందుకు కొనసాగింపుగా సినిమాకి సరైన ఎండింగ్ కూడా ఇచ్చినట్టుగా అనిపించదు. వీటితో ఈ చిత్రం స్టార్టింగ్ లో కొంతమేర ఎగ్జైట్ చేసినా తర్వాత రొటీన్ ప్లే తో నిరాశపరుస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నీకల్ టీం లో సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ లో ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ విషయంలోకి వస్తే..తాను పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలా రొటీన్ థ్రిల్లర్ డ్రామాని తాను తెరకెక్కించాడు. పేలవమైన నరేషన్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ని తాను డిజైన్ చేసుకున్నాడు దీనితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ థ్రిల్లర్ లా అనిపించదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “హెర్” చిత్రం రుహాణి శర్మని అయితే కొత్తగా చూడవచ్చు ఏవో కొన్ని అంశాలు ఓకే అనిపిస్తాయి తప్ప మిగతా సినిమా అంత పరమ రొటీన్ థ్రిల్లర్ గానే అనిపిస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ ని మెప్పించలేదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :