ఎమోషనల్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్న ‘మేజర్’ ట్రైలర్ !

Published on May 9, 2022 5:09 pm IST

యంగ్ హీరో అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమా ‘మేజర్’. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ లో మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా కట్ చేశారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది ఈ సినిమా.

అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ షాట్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా అడివి శేష్ పాత్రకు సంబంధించిన ట్రాక్ తో పాటు.. సినిమాలో మెయిన్ ఎమోషన్స్ ను ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు. మొత్తానికి గ్రిప్పింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

కాగా మేజర్‌ చిత్రంలో సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ బహు భాషా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :