హీరో తన మూవీ కథ మొత్తం లీక్ చేశేశాడే…!

హీరో తన మూవీ కథ మొత్తం లీక్ చేశేశాడే…!

Published on Oct 14, 2019 12:34 PM IST

Aadi Pinisetty

ఒక ప్రక్క హీరోగా నటిస్తూనే విలన్ మరియు సహనటుడు వంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు హీరో ఆది పినిశెట్టి. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం క్లాప్. స్పోర్ట్స్ నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన అథ్లెట్ గా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో క్లాప్ మూవీ కథ దాదాపు చెప్పేశారు. 400మీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొనే స్ప్రింటర్ గా కనిపించనున్నాడట ఆది. విష్ణు అనే స్ప్రింటర్ 400 మీటర్ల రన్నింగ్ రేసులో అత్యున్నత స్థాయికి ఎదగాలని కలకు కంటూ ఉంటారట. ఒక డ్రీం చేజర్ గా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళుతున్న విష్ణు జీవితం అనుకోని సంఘటనల కారణంగా తలకిందులవుతుందట. మరి ఆ ఊహించని పరిణామాల వలన అథ్లెట్ విష్ణు జీవితం ఏమైంది? అసలు తన కలలు నెరవేరాయా?, లేదా? అనేదే అసలు కథ అని ఆది క్లాప్ మూవీ కథను చెప్పుకొచ్చారు.

అలాగే ఆది ఈ మూవీలో స్పోర్ట్స్ గాయ్ గా ఒక షేడ్, అలాగే రొమాంటిక్ ఫెలో గా మరో షేడ్ లో కనిపిస్తారట. ఆది సరనస ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, నాజర్ వంటి నటులు ఇతర కీలపాత్రలలో కనిపించనున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు