నెక్స్ట్ సినిమాకు రెడీ అయిన అఖిల్ .. ఎవరితో అంటే?

Published on Jul 20, 2021 3:00 am IST


అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతో పాటు అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ మరో కొత్త సినిమాని లైన్‌లో పెడుతున్నట్టు తెలుస్తుంది. ‘అందాల రాక్షసి’ సినిమా దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేస్తున్నట్టు సమాచారం. అయితే హను చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అఖిల్ ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ‘ఏజెంట్’ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుండగా, దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రాబోతుంది.

సంబంధిత సమాచారం :