యాక్షన్ ముంచేస్తోందని.. కామెడీ వైపు చూస్తున్నాడు !

Published on Mar 24, 2019 11:50 am IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసందే. అయితే గత కొన్ని సినిమాలుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడుతోన్నాడు గోపీచంద్. అందుకే యాక్షన్ ముంచేస్తోందని.. ఈ సారి కామెడీ వైపు చూస్తున్నాడు.

గోపీచంద్ మొత్తానికి తన తరువాత సినిమాకి తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు సంపంత్ నంది గోపీచంద్ కోసం ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తాయట.

ఇక గోపీచంద్ లాస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లౌక్యం’, మళ్లీ ఇన్నాళ్ళకు మరో ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. మరి ‘లౌక్యం’ లాగే ఈ కామెడీ ఎంటర్ టైనర్ కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి సంపత్, గోపీచంద్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More