జిల్ కాంబినేషన్ మళ్లీ సెట్ అయిందా ?

జిల్ కాంబినేషన్ మళ్లీ సెట్ అయిందా ?

Published on Feb 7, 2023 8:36 PM IST

రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ హీరో గోపీచంద్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా గోపీచంద్ కి రాధాకృష్ణ కుమార్ ఓ కథ చెప్పాడని, గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను – గోపీచంద్ ను కలిపింది యూవీ క్రియేషన్సే అని టాక్. మరి గోపీచంద్ ఇమేజ్ కోసం రాధాకృష్ణ కుమార్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి సంపత్ నంది గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా రాధాకృష్ణ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇక గతంలో రాధాకృష్ణ కుమార్ – హీరో గోపీచంద్ కలయికలో జిల్ అనే సినిమా వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు