కార్తికేయ “భజే వాయు వేగం” టీజర్ కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్!

కార్తికేయ “భజే వాయు వేగం” టీజర్ కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్!

Published on Apr 19, 2024 5:04 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ చివరిసారిగా బెదురులంక 2012 లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ భజే వాయు వేగం ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదల పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. రేపు మధ్యాహ్నం 2:25 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. కార్తికేయ చేతిలో బ్యాట్ తో ఉండి, పరిగెడుతున్న పోస్టర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు