చరణ్ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో ?

చరణ్ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో ?

Published on Jul 10, 2022 8:19 PM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో కొత్త విలన్ పేరు వినిపిస్తోంది. తమిళ మాజీ రొమాంటిక్ హీరో మాధవన్ ఈ చిత్రంలో మరో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మాధవన్ ఓ బిజినెస్ మెన్ పాత్రలో నటిస్తున్నాడట. మాధవన్ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది అని తెలుస్తోంది.

పైగా మాధవన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. అసలు ఇతను మాధవన్ నేనా ? అనేలా ఆయన పాత్ర ఉంటుందట. మరి ఈ పాత్ర ద్వారా మాధవన్ ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో చరణ్ ను కూడా వినూత్నంగా చూపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు