ఠాగూర్ మధు తో నిఖిల్ సినిమా !
Published on Nov 20, 2017 1:52 pm IST

యువహీరో నిఖిల్ వరుసగా చేసిన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ’ వంటి సినిమాలు విజయం సాధించడంతో నిర్మాతలు నిఖిల్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా తమిళ్ లో హిట్ అయిన ‘కనిదన్’ రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు.

జనవరి నుండి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం. త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు టి ఎస్ సంతోష్ తెలుగు వెర్ష‌న్ కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయి. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం నిఖిల్ కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఏ.కె ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తరువాత ‘కనిదన్’ రీమేక్ మొదలు కానుందని సమాచారం.

 
Like us on Facebook