హీరోగా రాబోతున్న క్రేజీ హీరో తమ్ముడు ?

హీరోగా రాబోతున్న క్రేజీ హీరో తమ్ముడు ?

Published on Jul 4, 2018 3:43 PM IST

vijaydvaara3

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నారని సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారట.

‘పెళ్లి చూపులు’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించి విజయ్ దేవరకొండకి హీరోగా ఫస్ట్ హిట్ అందించిన సురేశ్‌బాబు, ఇప్పుడు అతని తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉందో గాని ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే గాని ఏ విషయం అనేది తెలియదు.

తాజా వార్తలు