కార్తీక్ గా మరొకరిని ఊహించుకోలేను-గౌతమ్ మీనన్

Published on Feb 28, 2020 1:15 am IST

టాలెంటెడ్ దర్శకులలో ఒకరిగా ఉన్న గౌతమ్ మీనన్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన బెస్ట్ మూవీస్ లో ఏమాయ చేశావే ఒకటి. నాగ చైతన్య హీరోగా సమంత ను వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను ఏక కాలంలో గౌతమ్ మీనన్ తమిళంలో శింబు, త్రిషా లతో తీశారు. ‘విన్నై తాండి వరువాయా’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఐతే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన గౌతమ్ మీనన్ కి ఎప్పటి నుండో వుంది. తాజాగా ఇదే విషయమై ఈ దర్శకుడిని అడుగగా ‘విన్నై తాండి వరువాయా’ చిత్రానికి సీక్వెల్ తీస్తే అది మళ్ళీ హీరో శింభుతోనే చేస్తాను అని ఆసక్తికర సమాధానం చెప్పారు. ఆ సినిమాలో కార్తీక్ పాత్రను మరో హీరోతో ఉహించుకోలేనని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :