ఆ యువహీరో చిత్రం మూడు భాషల్లో ఒకేరోజు విడుదల !
Published on Oct 24, 2017 11:27 am IST


ఒకప్పుడు వరుస విజయాలతో మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న సిద్ధార్థ్ ఆ తరువాత తెలుగులో అతని సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, తను తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చెయ్యడం జరిగింది. ఆ మధ్య సిద్ధార్థ్ నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ కూడా ఆశించిన స్థాయిలో విజయం అందలేదు. చాలా గ్యాప్ తరువాత సిద్ధార్థ్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తాజాగా సిద్ధార్థ్, ఆండ్రియా నటించిన ‘గృహం’ సినిమా వచ్చేనెల 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. ట్రైలర్ చాలా సస్పెన్స్ తో భయానకంగా ఉంది. ఈ హార్రర్ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల చెయ్యనున్నారు. కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకొని డైరెక్టర్ మిలింద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 
Like us on Facebook