హీరోకి దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్.. కారణం భారీ విజయమే !

Published on Sep 25, 2022 11:52 pm IST

‘మానాడు’, ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు హీరో శింబు. మొత్తానికి ‘ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ ఇచ్చిన విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి తోడు హీరో శింబుకి ఖరీదు అయిన బహుమతులు కూడా అందుతున్నాయి. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ నిర్మాత ఈశారి కె. గణేష్ తాజాగా తన సినిమా టీమ్ కి సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హీరో శింబుకు ఓ ఖరీదైన కారును గిప్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

అలాగే హీరో శింబుతో పాటు డైరెక్టర్ గౌతమ్ మీనన్‌ కు కూడా ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును బహుమతిగా ఇచ్చాడు ఈశారి కె. గణేష్. ఈ గిఫ్ట్ లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శింబు అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమాకు జయ మోహన్ కథను అందించాడు. ఏఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా, ఆంథొనీ ఎడిటర్‌గా ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఈ చిత్రంలో శింబు సరసన సిద్ధి ఇద్నానీ హీరోయిన్ గా నటించింది. అలాగే, రాధికా శరత్ కుమార్, సిద్దిఖీ, నీరజ్ మాధవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం :