హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సైదులు’. బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించబోతున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “సైదులు” టైటిల్ చాలా క్యాచీగా ఉందని, కాన్సెప్ట్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉందని అన్నారు. ఈ సినిమాతో యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.
దర్శకుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ మా చిత్రం టైటిల్ లోగోను హీరో శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయని, అక్టోబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నామని తెలిపాడు. కాగా త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఇక ఈ చిత్రానికి పి.యస్ మణికర్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, ఆర్.ఆర్.ధృవన్ సంగీతం అందిస్తునాడు.


