ఇంటర్వ్యూ: నా ప్యూచర్ ప్రాజెక్ట్స్ వారితోనే – హీరో సుహాస్

Published on Aug 18, 2021 8:00 pm IST

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి హీరోగా తొలి చిత్రం “కలర్ ఫోటో” ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ తాజాగా “రైటర్ ప‌ద్మ‌భూష‌ణ్” సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, ల‌హ‌రి ఫిలిమ్స్ సంయుక్త సమర్పణలో రాబోతున్న ఈ తొలి చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమయ్యింది. ఈ సందర్భంగా హీరో సుహాస్ మీడియాతో పంచుకున్న విశేషాలు.

ప్రస్తుతం తాను చేస్తున్న “రైటర్ పద్మ భూషణం” షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా నుంచి రేపు ఓ పోస్టర్ విడుదల కాబోతుందని తెలిపారు.

తాను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నానని, హీరో అవుతానని అసలు అనుకోలేదని, “కలర్ ఫోటో” ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఇంకా మంచి కథలు వస్తున్నాయని అన్నారు.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో మంచి ఆఫర్స్ వచ్చాయని, మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ రావడం వలన ‘కలర్ ఫోటో’ సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని అన్నారు. ఇన్ని రోజులు షార్ట్ ఫిలిమ్స్ చేసిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారితోనే ప్యూచర్ ఫిలిమ్స్ చేస్తున్నానని అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయని, ప్రస్తుతం ఆరు సినిమాలు లైన్‌లో ఉన్నాయని, అందులో ఐదు సినిమాలో లీడ్ రోల్ పోశిస్తున్నానని, ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని అన్నారు.

నాకు బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదని, చాయ్ బిస్కెట్ ఛానల్‌లో మూవీ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏర్పడిన పరిచయాలు, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమా అవకాశాలు వచ్చాయని అన్నారు. మా ఫ్యామిలీ అంతా విజయవాడలో ఉంటారని, పేరెంట్స్ నుంచి, నా వైఫ్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉందని అన్నారు.

“రైటర్ పద్మభూషణ్” డైరెక్టర్‌తో తనకు ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని, కలర్ ఫోటోకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని, తాను చేసిన నందన్ అనే షార్ట్ ఫిలింకి రైటర్‌గా కూడా చేశాడని అన్నారు. చాలా మంచి రైటర్ అని, అతడు స్టోరీ చెప్పగానే చాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ అన్నకి చెప్పి, డైరెక్టర్‌ను వారికి పరిచయం చేశానని, స్టోరీ వినగానే వెంటనే ఒకే చెప్పి మాతో మూవీ స్టార్ట్ చేసేశారని అన్నారు.

ఈ సినిమాకు శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అని, మొత్తం నాలుగు పాటలున్నాయని, చాలా మంచిగా ఉన్నాయని, త్వరలోనే సాంగ్స్ ద్వారా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా టీనా శిల్పా చేసిందని, తను కూడా తెలుగు అమ్మాయేనని, తను కూడా చాలా బాగా చేసింది.

ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, రోహిణీ నాకు ఫాదర్, మదర్ రోల్ పోశించారని వాళ్లు నాతో చాలా బాగా కలిసిపోయారని, దాంతో మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని తెలిపారు. మంచి ఎమోషన్స్, కామెడీతో కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని అనుకుంటున్నానని చెప్పాడు.

చాయ్ బిస్కెట్‌తో నాకు చాలా ఎమోషన్ ఉందని, నన్ను హీరోగా నిలబెట్టారని అన్నారు. మొదటి నుంచి నాకు సపోర్ట్ ఇచ్చింది చాయ్ బిస్కెట్ అని తెలిపారు. ఇండస్ట్రీలో తొలుత కాస్త ఇబ్బందిపడ్డా కానీ నాకు పరిచయమున్న హీరోలు, డైరెక్టర్ల నుంచి మంచి సపోర్ట్ లభించేదని, వారంతా నాకు సజేషన్స్ ఇస్తూ మంచిగా మోటివేట్ చేసేవారని అన్నారు.

సంబంధిత సమాచారం :