ఆ పదం వాడడం తప్పే.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..!

Published on May 3, 2022 2:52 am IST


మాస్ కా దాస్ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌ స్పీడు పెంచిన చిత్ర బృందం అభిమాని చేత సూసైడ్‌ చేయిస్తున్నట్టుగా ఓ ప్రాంక్‌ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట హల్‌చల్‌ కావడంతో రోడ్డుపై సూసైడ్ పేరుతో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారంటూ హీరో విశ్వక్‌ సేన్‌పై అరుణ్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్‌ హీరో విశ్వక్‌ సేన్‌, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపుర‌నేని చిట్టితో డిబెట్‌ నిర్వహించింది. అందులో లేడీ యాంకర్‌కి మరియు హీరో విశ్వ‌క్‌ సేన్‌కి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన హీరో విశ్వక్‌ సేన్ ఓ అభ్యంతరకర పదాన్ని వాడాడు. అయితే తాజాగా దీనిపై స్పందించిన విశ్వక్ సేన్ ఆ పదాన్ని వాడడం తప్పేనని, సహనం కోల్పోయి అలా మాట్లాడానని అందుకు సారీ చెబుతున్నానని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :