“కార్తికేయ 2” కి తన లాస్ట్ వర్క్ ఫినిష్ చేసిన అనుపమ.!

“కార్తికేయ 2” కి తన లాస్ట్ వర్క్ ఫినిష్ చేసిన అనుపమ.!

Published on Jun 30, 2022 8:00 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ చిత్రం “కార్తికేయ 2”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి భారీ స్థాయిలో తెరకెక్కించాడు. మరి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ ట్రైలర్ కి కూడా భారీ రెస్పాన్స్ రాగా సినిమాపై ఆడియెన్స్ లో కూడా ఓ రేంజ్ లో ఆసక్తి పెరిగింది.

మరి ఈ చిత్రానికి అయితే హీరోయిన్ అనుపమ తన డబ్బింగ్ ని కంప్లీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోడం ద్వారా అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో జూలై 22న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు