వెంకీకి హీరోయిన్ దొరికేసింది !

విక్టరీ వెంకటేష్ ఈ మధ్యే తేజ డైరెక్షన్లో ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో నటించనుండగా ‘ఆట నాదే వేట నాదే’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఈ చిత్రంలో ముందుగా బాలీవుడ్ నటి అధితిరావ్ హైదరిని హీరోయిన్ గా అనుకున్నా ఆమె డేట్స్ కుదరకపోవడవంతో శ్రియ శరన్ ను ఫైనల్ చేశారు.

శ్రియ, వెంకీలు గతంలో ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకోనున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుండటం విశేషం. సురేష్ బాబు, అనిల్ సుంకరలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.