మూడు సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ !

రస్మిక తెలుగులో ఒక్క సినిమాకూడా విడుదల అవ్వకముందే ఈ హీరోయిన్ 3 సినిమాల్లో నటిస్తోంది. అందులో మొదటిది నాగ శౌర్య చలో. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సినిమా చేస్తోంది. పరుశురం బుజ్జి దర్శకుడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా కు గీతా గోవిందం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఈ రెండు సినిమాలతో పాటు రామ్ సినిమాలో ఈ అమ్మాయి ఎంపిక అయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రినాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.