ఇండస్ట్రీలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను – ‘విద్యా బాలన్‌’ !

Published on Aug 27, 2019 11:00 pm IST

జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీతగా ‘విద్యా బాలన్‌’ తన పెర్ఫామెన్స్ తో పాటు తన గ్లామర్ తోనూ ప్రేక్షకులకు బాగా దగ్గరై.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కాగా ఈ టాలెంటెడ్ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమల్లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, వేధింపులు, కష్టాలున్నాయని అంటూ విద్యాబాలన్‌ కామెంట్స్ చేసింది. తానూ 1990 కాలంలో ‘హమ్‌ పాంచ్‌’తో సినిమాల్లోకి వచ్చానని.. ఆ తర్వాత 2003లో గాని తనకు సరైన బ్రేక్ రాలేదని.. ఆ మధ్య కాలంలో తానూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొవాల్సి వచ్చిందని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా విద్యాబాలన్ మాట్లాడుతూ ‘చెన్నైలో సినిమా అవకాశాలు కోసం ప్రయత్నిస్తోన్న సమయంలో నా జీవితంలో నాకు ఎప్పటికి గుర్తుండిపోయే ఓ సంఘటన చోటు చేసుకుంది. సినిమా కోసం ఓ దర్శకుడుని కలవాల్సి వచ్చింది. అతనితో నేను ఎక్కడైనా కాఫీ షాప్‌ లో కూర్చుని మాట్లాడుకుందామంటే.. అతను మాత్రం ఓ హోటల్‌ కు వెళ్ళదామన్నాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను హోటల్‌కి వెళ్లాను. దాంతో అతను మా రూమ్ తలుపులు మూయడానికి ప్రయత్నిస్తే దానికి నేను అంగీకరించలేదు. అదేవిధంగా మరో చోట కూడా ఓ నిర్మాత నాతో తప్పుగా ప్రవర్తించబోతే నేను అతనికి తగిన రీతిలో సమాధానం చెప్పాను. దాంతో ఆ సినిమా నుండి నన్ను తొలిగించాడు ఆ నిర్మాత’ అంటూ తన సినీ ప్రయాణంలోని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది విద్యా బాలన్.

సంబంధిత సమాచారం :